తొర్రూరులో హైటెన్షన్… మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ హౌస్ అరెస్ట్

Facebook
X
LinkedIn

తొర్రూరు :

మహబూబాబాద్ లో మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను హౌస్ అరెస్ట్ చేయడంతో తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. మంగళవారం తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరుపున మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను బిఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నిక ఇంచార్జ్ గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నియమించారు.‌‌ కురవిలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలలో ఆమె పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు వెళ్ళేందుకు సిద్దమవుతున్న క్రమంలో మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను మహబూబాబాద్ లోని ఆమె నివాసంలో పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తొర్రూరులో ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీ నిర్మానుషంగా మారింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీ లో షాపులు మొత్తం బంద్ చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సుమారుగా 500 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.