మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం

Facebook
X
LinkedIn

మక్తల్ :

అయితే మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు‌గా కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్ పర్సన్ శైవీ రెడ్డి.. ఆత్మకూరు చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్ పర్సన్ నల్లగొండ శ్రీనివాసులు.. అమరచింత చైర్ పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్‌లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లకు రాష్ట్ర క్రీడా, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాభినందనలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.