విజయవాడ :
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జాతీయ సేవ పురస్కార ప్రధానోత్సవం
వివిధ రంగాల్లో విశిష్టమైన సామాజిక సేవలను అందిస్తున్న సేవాభావి వ్యక్తులకు గౌరవార్థం మదర్ సర్వీస్ సొసైటీ (NGO) ఆధ్వర్యంలో డాక్టర్ మల్లాది ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలోని హనుమంతరావు గ్రంథాలయంలో “స్వతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జాతీయ సేవ పురస్కారం” ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ పురస్కారం ద్వారా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా శక్తీకరణ, యువజన సేవ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహిస్తూ సత్కరించడం మా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ సినిమా హీరోయిన్ సంధ్య ఉప్పలపాటి, హీరో కొప్పిశెట్టి, చంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ బుల్లితెర నటి సునీత ప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, ప్రముఖ సినీ నిర్మా తలు డాక్టర్.మూస అలీఖాన్ ఖాన్, డాక్టర్.ఎస్.కే. జలీల్, స్వచ్ఛంద సేవకులు కంచర్ల బుల్లి బాబు, డాక్టర్ బి. దాస్, డాక్టర్ కుటుంబ రాజు, ఐవిఎఫ్ రాష్ట్ర నాయకులు వీరాంజనేయులు పాల్గొని 50 మంది స్వచ్ఛంద సేవకులకు అల్లూరి సీతారామరాజు జాతీయ సేవ పురస్కారం అతిధుల చేతుల మీదుగా ప్రధానం . పురస్కార గ్రహీతలకు ప్రశంసాపత్రం, అల్లూరి సీతారామరాజు జ్ఞాపక మరియు శాలువాతో ఘనంగా సత్కరించారు .
మదర్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగుతున్న వారిని ప్రోత్సహించడం మా సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడే సేవకులందరికీ ఈ అవార్డు ఒక ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ మహనీయులు పేరుమీద అవార్డులు ప్రధానం చేయటం మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సంస్థల మధ్య ఐక్యతను మిమ్మల్ని కోసం స్వచ్ఛంద సంస్థలు నవభారత్ నిర్మాణం కోసం మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సేవ కార్యక్రమాలు అత్యంత ప్రశంసనీయమని అభినందనలు తెలిపారు. అవార్డు గ్రహీతలు వివిధ సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.