రాహుల్ గాంధీ పాదయాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన లోక్ సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :

140 సంవత్సరాల సుధీర్ఘ  చరిత్ర కలిగి ,భారతదేశాన్ని  60 సంవత్సరాలు పరిపాలించి  , ప్రపంచంలో అగ్రరాజ్యంగా మలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన 22 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఎన్నో అవమానాలు భరించి కరుడుగట్టిన  కాంగ్రెస్ వాదిగా  5000 కిలోమీటర్లు  పాదయాత్ర చేసి భారత్ జోడోయాత్ర  నిర్వహించిన యువనేత రాహుల్ గాంధీ  భారత భావి ప్రధానిగా కావాలని ,ఆయన పై వచ్చే దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మంచి పుస్తకం వ్రాసి,దేశవ్యాప్తంగా  వేలాది పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తు,విస్తృత ప్రచారం చేస్తున్న పుస్తక రచయిత రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్  ఆళ్ల రామకృష్ణ మిక్కిలి అభినందనీయుడని  ,భావి భారత ప్రధానిగా  రాహుల్ గాంధీ భారతదేశానికి స్వర్ణయుగం సృష్టిస్తారని డాక్టర్ మల్లు రవి ఆశాభావం వ్యక్తంచేస్తు ,ఈ పుస్తక  ఆవిష్కరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.ఈ సందర్బంగా కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా జేరిపోతుల పరశురామ్ పాల్గొన్నారు