కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి

Facebook
X
LinkedIn

జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా ఉపాద్యక్షురాలు గద్దాస్ శైలజ డిమాండ్.

హైద్రాబాద్ :

కేంద్ర స్థాయిలో ఓబీసీ సంక్షేమాన్ని చూసేందుకు బీసీ ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా ఉపాద్యక్షురాలు గద్దాస్ శైలజ డిమాండ్ చేశారు.  శనివారం మీడియా సమావేశం లో దేశంలో బీసీలు 56 శాతం ఉన్నారని, వారి ఆలనా పాలన చూసే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎసీ మైనార్టీ, మహిళలు వంటి వారికి మంత్రిత్వశాఖలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. వెంటనే బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని  కోరారు. 56 శాతం జనాభా ఉన్న బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం బాధకరమని ఆయన వివరించారు. బిసిలకు ఉపాధి, విద్యలో 27 శాతం అమలు చేస్తున్నారని, జాతీయ బిసి కమీషన్ కార్పోరేషన్లు కూడా ఉన్నట్లు ఆయన పేర్కోన్నారు. గత 15 సంవత్సరాల క్రితం బిసి పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేశారని, బిసి రిజర్వేషన్లు, ఇతర సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం బిసి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడం అత్యవసరమని శైలజ తెలిపారు.ఈకార్యక్రమం లో బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు రామంజనేలు, రాజేందర్, నికిల్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.