నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి

Facebook
X
LinkedIn

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో  కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోండి..

సంగా రెడ్డి  :

సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తా నని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగ్గా రెడ్డి జగ్గా రెడ్డి తెలిపారు.మునిసిపల్ ఎన్నికలలో భాగంగా శనివారం ప్రచారం లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూనేను ఎమ్మెల్యేగా లేకున్నా మీ పనులు చేయిస్తున్నాను.. ఇక ముందు కూడా చేపిస్తానన్నారు.5500 మందికి గతంలో ఇళ్ల స్థలాలు సర్టిఫికెట్లు ఇచ్చిన.. స్థలాలు లేని వారికి కూడా 80 గజాల చొప్పున ఇప్పిస్తాననిఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ మాట్లాడిన నన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాలన్నీ అమలు చేస్తున్నారు15 వేల మంది సంగారెడ్డి పట్టణ ప్రజలతో జగ్గా రెడ్డి ముఖాముఖి సభ నిర్వహించారు.ఈ సందర్బంగాజగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తున్నారు60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?అని ప్రశ్నించారు.ప్రతిపక్షాలు దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బియ్యం తక్కువ ఉన్నా తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉంది.ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు.రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాంసంగారెడ్డి మున్సిపాలిటీలో  38 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండిగెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డు ల్లో సీఎం రేవంత్ తో మాట్లాడి అన్ని పనులు చేయిస్తా ని హామీ ఇచ్చారు.ఒక్కో వార్డుకు 8 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తాజగ్గారెడ్డి మాటంటే మాటేసంగారెడ్డిలో అన్ని వార్డులు గెలిస్తే 300 కోట్లు తీసుకువస్తా2013లో 5500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చానుకానీ పదేళ్లు BRS ప్రభుత్వం పొజిషన్ ఇవ్వలేదు నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది 5500 మందితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి స్థలాలు ఇప్పుస్తాఎమ్మెల్యేగా లేకున్నా సంగారెడ్డి ప్రజలకు పనులు చేపిస్తానా భార్య నిర్మలా సంగారెడ్డిలో పర్యటిస్తుందినిర్మల సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందినేను తెలంగాణ మొత్తం తిరుగుతామీకు రోజు పాలిచ్చే ఆవు కావాలా..? ఐదేళ్లకోసారి పాలిచ్చే ఆవు కావాలా..? మీరే తేల్చుకోండిఅప్పుడప్పుడు ఆవుకు మేత దొరక్కపోతే  పాలివ్వదు.నేను కూడా అంతే నా దగ్గర మేత లేకపోతే పాలు ఇవ్వను ఈ మున్సిపల్ ఎన్నికలు అత్త కోడళ్ల తీరు ఉందితాళం అత్తకి ఇచ్చి కోడలిని వంట చేయమంటే ఎలా చేస్తుందిసంగారెడ్డి   మున్సిపల్ ఎన్నికల్లో వేరే  పార్టీ  అభ్యర్థులను గెలిపించి  నన్ను పనులు చేయమంటే ఎలా చేస్తానేను సదాశివపేటలో మహిళకు లక్ష రూపాయలు సహాయం చేస్తే నాపై ఎన్నికల కమిషన్ కి బీజేపీ, బిఆర్ఎస్  నాయకులు  ఫిర్యాదు చేశారునేను రోజు పాలిచ్చే అవును కాబట్టి అలానే చేస్తా నన్నారు.