హైదరాబాద్ :
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో EPTRI కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన తరగతులు, JNTU, Osmania యూనివర్సిటీలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు, పబ్లికేషన్స్ ప్రచురణలు మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం నేడు డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో EPTRI కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. పరిశోధన, శిక్షణ, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. EPTRI ద్వారా అమలవుతున్న ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక అంశాలపై బోర్డ్ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా పర్యావరణ అనుకూల కార్యక్రమాలను వేగవంతం చేయాలని, వివిధ శాఖలతో సమన్వయం పెంచాలని ఆయన సూచించారు.పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి, వాయు కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపకం వంటి అంశాల్లో EPTRI మరింత చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో చర్చించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజ్జా, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి, బోర్డ్ మెంబర్స్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.