బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న నేతకు బిఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఏమిటి?

Facebook
X
LinkedIn

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

 హైదరాబాద్ :

బీసీ సమాజం సుదీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు జరగకుండా నిలువునా  అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డి మొన్నటితో ముసుకు తొలగిందని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నందుకు ప్రతిఫలంగా టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ పదవ వార్డు కౌన్సిలర్ గా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల జేఏసీ   చైర్మన్ కుందారం గణేష్ చారి అద్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసిందని, ఈ జీవో  తో బీసీల కు 42 శాతం సర్పంచులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు దక్కుతవాయని రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఎంతో సంబరపడ్డారని కానీ బీసీల ఆశలను అడియాసలు చేస్తూ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి రెడ్డి జాగృతికి చెందిన బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి రాత్రికి రాత్రి హైకోర్టు సుప్రీంకోర్టుల ద్వారా బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని 42 శాతం రిజర్వేషన్ల జీవోను రద్దు చేయించారని అని తెలిపారు .60 శాతం జనాభా ఉన్న బీసీల నోట్లో మట్టి కొట్టి తినే కంచంలో మన్ను పోసిన మాధవరెడ్డి వెనుక ఏ శక్తి ఉందో తేలాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమాజం రోడ్లెక్కిందని చివరికి రాష్ట్ర బందు జరిపి ఉద్యమాన్ని ఉధృతం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో బుట్టం గారి మాధవరెడ్డి ముసుగు తొలగిందని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆదేశాలతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాధవరెడ్డికి గులాబీ కండువా కప్పి బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నందుకు బహుమానంగా టిఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేయడానికి బి ఫామ్ ఇచ్చారని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాకు ఆధారాలు చూపించారు  అనతరం బీసీ కుల సంఘాల జేఏసీ   చైర్మన్ కుందారం గణేష్ చారి మాట్లాడుతూ  ఇన్ని రోజులు తాము బీసీ రిజర్వేషన్లకు మద్దతు అంటూ నమ్మబలికిన టిఆర్ఎస్ బీసీల ద్రోహిని తమ పార్టీలోకి చేర్చుకుని బీసీ సమాజానికి తాము బీసీలకు వ్యతిరేకం అని సందేశం ఇచ్చిందని టిఆర్ఎస్ పెద్దలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు తెలవకుండా బుట్టెం గారి మాధవరెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పడని, ఒకవేళ వారికి తెలవకుండా పార్టీలోకి చేర్చుకుంటే బీసీలపై ఏమాత్రం టిఆర్ఎస్  చిత్తశుద్ధి ఉన్న మాధవరెడ్డిని 48 గంటల్లోగా ఆ పార్టీ నుండి బహిష్కరించాలని లేదంటే బీసీ రిజర్వేషన్లను మాధవరెడ్డి ద్వారా అడ్డుకున్నది టిఆర్ఎస్ పార్టీని నేనని దమ్ముంటే బహిరంగంగా వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు .   మాధవరెడ్డి గులాబీ పార్టీలో చేరిక, టికెట్ కేటాయింపు పై కేసీఆర్ కేటీఆర్ లు 48 గంటల్లోగా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ కార్యాలయం ముందు ధర్నాలు చేపడతామని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ జేఏసీ కో చైర్మన్ దిటి మల్లయ్య, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వా గారు అధ్యక్షులు  శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ కోఆర్డినేటర్ గజ్జల సత్యరాజ్ గౌడ్, సంధ్యారాణి, పాలకూరి కిరణ్, సందీప్ ముదిరాజ్, ఇంద్రం రజక, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల చందు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.