మాదక ద్రవ్యాల ప్రభావం వల్ల నాశనం అవుతున్న  యువత భవిష్యత్తు

Facebook
X
LinkedIn

మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సులో విజయ మోహన్ రావు

ఏలూరు :

నేటి బాలలే రేపటి పౌరులని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బాల బాలికలదేనని ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ డి.జి.సి.ఇ.ఓ. & చైర్మన్ డాక్టర్ సి.హెచ్. విజయ మోహన్ రావు పేర్కొన్నారు.గురువారం ఏలూరు జిల్లా,  కుక్కునూరు మండలం, నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో కుకునూరు మండలంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల, చీరవల్లి జెడ్పీ హై స్కూల్, రాజీవ్ నగర్ జెడ్పీ హై స్కూల్‌లలో “సే నో టు డ్రగ్స్ – సే నో టు కరప్షన్” అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ విజయ మోహన్ రావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల ప్రభావం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, చిన్న వయసు నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు, విద్యావంతులు, యువకులు మరియు సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఏలూరు జిల్లా అధ్యక్షుడు వసంత కుమార్ మాట్లాడుతూ, బాల్యం నుంచే విద్యార్థులు డ్రగ్స్ మరియు అవినీతిపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ, డ్రగ్స్‌కు అలవాటు పడితే కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు మరియు సామాజిక నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ బయ్యని నాగేశ్వరరావు, జిల్లా చీఫ్ అడ్వైజర్ మంత్రి గోపాలకృష్ణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బుడుగుల తరుణ్, మునగాల సాయి, కీసరి సాంబశివరావు, రాజీవ్ నగర్ జెడ్పీ హై స్కూల్ హెడ్‌మాస్టర్, కుకునూరు బాలికల ఆశ్రమ పాఠశాల హెడ్‌మాస్టర్ మంగమ్మ, చీరవల్లి హై స్కూల్ హెడ్‌మాస్టర్ రాధతో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.