బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు

Facebook
X
LinkedIn

కాంగ్రెస్ అరాచకఅవినీతి పాలనపై బిజెపి చార్జ్‌షీట్ విడుదల

హైదరాబాద్ :

మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ  “బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు” పేరిట భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ చార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ చార్జ్‌షీట్‌ను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్‌. రాంచందర్‌ రావు  , మహారాష్ట్ర మంత్రి, తెలంగాణ మున్సిపల్‌ & కార్పొరేషన్‌ ఎన్నికల ఇంచార్జ్‌  అశిష్‌ షెలార్‌  పార్టీ సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్‌ & కార్పొరేషన్‌ ఎన్నికల కో–ఇంచార్జులు  అశోక్‌ పర్ణామి , ఎంపీ  ఈటల రాజేందర్‌  , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్‌. గౌతం రావు , రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్‌   ఎన్‌.వి. సుభాష్‌ , సీనియర్‌ నాయకులు  జి. వెంకట్‌ రెడ్డి  ,   సునీత  ,   విఠల్‌  ,  కప్పర ప్రసాద్‌   తదితరులు పాల్గొన్నారు.