తెలుగువారు అన్ని రంగాల్లో నెం.1గా ఉండాలి: లోకేశ్

Facebook
X
LinkedIn

జ్యూరిక్ :

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరాతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తెలుగు అన్ని రంగాల్లో నెం.1గా ఉండాలని ఆకాంక్షించారు. ‘‘సముద్రాలు దాటి వచ్చినా మన సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ సమావేశం కూటమి ప్రభుత్వానికి అదృష్టం లాంటిది. ఏడాదిన్నరలో ఎపికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి, ఐటి, క్వాంటమ్ అంటూ ఎపిని చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.