న్యూ డిల్లీ :
తె లుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణల్లో ఏప్రిల్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసిఐ) అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఎస్ఐఆర్ ప్రారంభించి, మే నెల మూడవ వా రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ తొలి దశను బిహార్ లో పూర్తి చేయగా ప్రస్తుతం రెండో దశలో దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తోంది. రెండవ దశలో గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో కొ నసాగుతున్న ఎస్ఐఆర్ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎపి, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రా ల్లో మూడవ దశ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడతామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.