సంక్రాంతి ముగ్గులు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి

Facebook
X
LinkedIn

మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి

హైదరాబాద్ :

సంక్రాంతి ముగ్గులు మన తెలుగు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి అన్నారు.
సంక్రాంతి పండుగ ఉత్సవాలలో భాగంగా, కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సీనియర్ సిటిజన్ ఆవరణలో ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమలానగర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ముగ్గురు ఉపాధ్యాయులతో కలిసి మొదటి, రెండవ, మూడవ బహుమతులను ప్రకటించారు. విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పావని మణిపాల్ రెడ్డి కన్సొలేషన్ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా పావని మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి అనేది తెలుగింటి ఆడపడుచులకు ఎంతో ముఖ్యమైన పండుగని, ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటామని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా 15 రోజులపాటు రంగురంగుల ముగ్గులు వేస్తూ మన సంతోషాన్ని, భావోద్వేగాలను వ్యక్తపరుస్తారని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ రాఘవరెడ్డి, ఏ.వీఆర్ దత్తు,కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, సెక్రటరీ నవీన్, కార్యదర్శి వెంకటరెడ్డి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు అమ్మన్న శాస్త్రి, దశరథ గౌడ్, సీఎన్ రావు, వంజరి ప్రవీణ్, సంజీవరెడ్డి, వెంకటయ్య,పెంటయ్య గౌడ్, బాలరాజు, ప్రసాద్, మదన్, సుభాషిని, కరుణ, కవిత, పద్మా గౌడ్, మీరా, వాసుదేవ్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, గోపీ, సంపత్, వెంకటరాజ్యం, ఆంజనేయులు సాగర్, సుధాకర్, కిషోర్ సంగయ్య, అంజయ్య గౌడ్, చలపతిరావు, దస్బి, ఆనంద్ నాయుడు, ఉమేష్ చారి, రాజేష్ , నితీష్ చారి, శివ, తదితరులు పాల్గొన్నారు.