‘గ్రేటర్ ఉప్పల్ మున్సిపల్ కార్పోరేషన్’ పేరు పెట్టాలి!

Facebook
X
LinkedIn

సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ భారత సుదర్శన్

హైదరాబాద్ :

సోయిలేని, వెన్నెముక లేని రాజకీయ నాయకులతో ‘ఉప్పల్ అస్థిత్వం’ పూర్తిగానీరుగారిపోతోందని సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ భారత సుదర్శన్ అన్నారు. అన్ని రకాలుగా ‘ఉప్పల్ ప్రాంతం’ గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత కీలకంగా ఉన్నా కూడా ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.అటుమల్కాజిగిరి..ఇటు ఎల్బీనగర్ ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న ‘ఉప్పల్ ప్రాంతం’ను విస్మరిస్తూ కొందరుఉన్నతాధికారులుఉప్పల్,మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లతో ‘గ్రేటర్ ఉప్పల్ మున్సిపల్ కార్పోరేషన్’ పేరు పెట్టకుండా ‘గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్’ పేరు పెట్టేందుకు ప్రయత్నించడం తీవ్ర అన్యాయమని భారత సుదర్శన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి సోయిలేని, వెన్నెముక లేని రాజకీయ నాయకులని సుదర్శన్ ఆవేదనచెందారు.ఆనాడు తాము ‘ఉప్పల్ జిల్లా’ను ఏర్పాటు చేయాలని, మెట్రో కి ‘ఉప్పల్ మెట్రో స్టేషన్’ అని పేరు పెట్టాలని కొట్లాడినా అధికారులు నియంతృత్వ పోకడలతో ‘ఉప్పల్ అస్థిత్వం, ఆత్మగౌరవం’ ను కాలరాసారన్నారు. జరుగుతున్న పరిణామాలతో కలత చెందే తాను స్పందించాల్సి వస్తోందని సుదర్శన్ తెలిపారు. ఇప్పటికైనా ‘గ్రేటర్ ఉప్పల్ మున్సిపల్ కార్పోరేషన్’ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే ‘ఉప్పల్ అస్థిత్వం, ఆత్మగౌరవం’ కోసం ప్రజల్ని మరింత చైతన్యపరిచి ఆందోళనలను చేస్తామని ఆయన తెలిపారు.