ఐదు రోజుల విడిది హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

Facebook
X
LinkedIn

ఈ నెల 17 నుంచి 5 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్‌ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవానికి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని జీఎంహెచ్‌ఎంసీని ఆదేశించారు.