గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఈ నెల 8,9 వ తేదీలలో ఫ్యూచర్ సిటీ వేదిక గా జరగనున్న తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్  కార్యక్రమ  ఏర్పాటు పనులను టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబులు    గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగునంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీ  లో గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని  పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్ , 500 కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరుకానుండటం తో వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు ఉండాలని ఆమె అధికారులను సూచించారు. ఈ కార్యక్రమం లో టీఎస్ఐఐసి ఎండి శశాంక్,   సీఈ రవి కుమార్,  ఈడి పవన్ , పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు , పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు