లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ అరెస్ట్

Facebook
X
LinkedIn

హన్మకొండ:

ప్రైవేటు పాఠశాల రెన్యువల్‌కు 60 వేలు లంచం డిమాండ్ చేసిన హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీ బారినపడ్డారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు గురువారం కలెక్టరేట్‌లో పక్కా ప్రణాళికతో దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రెన్యువల్ ఫైల్‌ను క్లియర్ చేయడానికి లంచం కోరినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండలో అదనపు కలెక్టర్ బాధ్యతలతోపాటు జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా కూడా వెంకట్ రెడ్డి పనిచేస్తున్నారు.

ఈ చర్యతో జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేగింది.