హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..!

Facebook
X
LinkedIn

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC). కేబీఆర్ పార్క్ వద్ద ఇప్పటికే పార్క్ వద్ద మల్టీ-లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పార్క్ వద్ద మల్టీ-లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఇది హైదరాబాద్‌లోనే మొదటిదని పేర్కొంటున్నారు. రోటరీ పార్కింగ్ సిస్టమ్‌గా రూపొందించ ఈ కాంప్లెక్స్‌లో ఒక్కొక్కటి 12 కార్లు ఉండేలా ఆరు యూనిట్లు ఉండనున్నాయి.

అదనంగా 20 శాతం స్థలం కాఫీ కియోస్క్‌లు, EV ఛార్జింగ్ పాయింట్లు, మినీ-మార్ట్‌లకు కేటాయించనున్నారు. ప్రస్తుతం అగ్రిమెంట్ ప్రకారం హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో 27 కార్ల మల్టీ లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్ ఒప్పందం కుదిరిన ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు పేర్కన్నారు. రియల్ టైమ్ పార్కింగ్ అప్‌డేట్‌లు, స్మార్ట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపులు, లైవ్ స్లాట్ ట్రాకింగ్, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ వంటి ముఖ్య ఫీచర్లు ఇందులో అందుబాటులోకి తీసుకురానున్నారు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న మొత్తం ఆరు జంక్షన్‌లను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 4న మొత్తం రూ.826 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మల్టీ-లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించారు. రూ. 421 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, ముగ్ధా జంక్షన్ వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ మొత్తం రూ. 405 కోట్లుగా అంచనా వేశారు.

ఇందులో భాగంగా ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ వద్ద జంక్షన్లను వద్ద పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. సాధారణంగా జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ ఉంటుంది. మల్టీ-లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్‌ వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గే వకాశం ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి కీలక ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తగ్గుతాయి.