జిఓ నం. 46ను ఉపసంహరించకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధనం చేస్తాం

Facebook
X
LinkedIn

బీసీ కుల సంఘాల భవిష్యత్తు కార్య చరణ సదస్సులో హెచ్చరిక _గర్జించిన బీసీలు.

#మోసం చేసే ప్రయత్నాలు మానుకోకపోతే భరతం పడతాo _ఆర్ కృష్ణయ్య

#నమ్మించి నట్టెట్ట  ముంచిన ప్రభుత్వంపై ధ్వజమెత్తినడాక్టర్ వకుళాభరణకృష్ణమోహన్ రావు

#ప్రకటించింది ప్రభుత్వమే _అన్యాయం చేస్తుంది ప్రభుత్వమే_సినిమా దర్శకుడు ఎన్.శంకర్

హైదరాబాద్ :

బీసీలకు స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్లకు మొండి చెయ్యి చూపిస్తూ, విడుదల చేసిన జీవో ఎం నంబర్ 46ను వెంటనే రేపటి క్యాబినెట్ సమావేశంలో ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని 100 బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం అన్యాయం చేయాలని కుట్రలు చేస్తే పతనం తప్పదని హెచ్చరించాయి.సోమవారం నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో 100 బీసీ సంఘాల ఉద్యమ కార్యాచరణ సమావేశం, రాష్ట్ర బీసీ కమిషన్, మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అధ్యక్షతన జరిగింది.ప్రభుత్వ వైఖరిని ఖండించారు వాడి వేడిగా సమావేశం జరిగింది.సమావేశంలో ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ…..ప్రభుత్వం బీసీలను ఇంతగా అందగా చేయడం దుర్మార్గం అని అన్నారు. ఇన్నాళ్లుగా నమ్మబలికి ఇప్పుడు కోర్టులను అడ్డుపెట్టి 42% రిజర్వేషన్ల ఎగవేతకు కుట్రలు చేయడం,  ధారూణమని అన్నారు. ప్రభుత్వం తన నైజాన్ని మార్చుకొని హామీకి కట్టుబడి, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. బీసీలు అమాయకులు కాదని రిజర్వేషన్ల సాధనకు రాష్ట్రవ్యాప్త మెరుపు ఉద్యమాలతో ముందుకెళ్తామని అన్నారు. హైకోర్టులో సరైన వాదనలు, సాక్షాలతో సి రిజర్వేషన్ల పెంపును సాధించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అనైతిక, ఆదర్శం, మోసం,  అన్యాయoలతో ప్రభుత్వం ఏం సాధించలేదని, ప్రజలు తిరగబడేలా, వ్యవహారం ముదరక ముందే మెజార్టీ బీసీల డిమాండ్ ను పరిష్కరించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ల పెంపు కేసు బలంగా ఉందని, సరైన రీతిలో వాదనలో ఉంటే సాధించవచ్చు అన్నారు. ఈ పవిత్ర బాధ్యత ప్రభుత్వంపై ఉంటే, దానిని విస్మరించి రిజర్వేషన్ల పెంపును ఎత్తివేయడానికి కుట్ర చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకపోవడం, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయంగా కొనసాగాలని. కృష్ణయ్య హితువు పలికారు. తొలుత డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ…..ప్రభుత్వం మొదటి నుండి ఈ అంశంలో వ్యవహరించిన ప్రతి దశలో చేసిన తప్పులను సాధికారికంగా ఎత్తిచూపారు. ఏ ఒక్కటి కూడా ప్రామాణిక పద్ధతులు పాటించలేదన్నారు.1) సిపెక్ కుల సర్వే స్వతంత్ర కమిషన్ చే నిర్వహించాలి అలా కాక ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. న్యాయపరంగా చెల్లుబాటు కాదు 2) స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఖరారు డెడికేషన్ కమిషన్ నివేదికలు గోప్యంగా  ఉంచారు_ఇది న్యాయపరంగా తప్పు4) జీవో నెంబర్ 9 జీవో నెంబర్, 46 రెండు తప్పే, ఇప్పటికీ సోదాహరణ లతో ఇలా అనేక అంశాలను వివరిస్తూ సమావేశంలో మాట్లాడారు. బిసి యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య ప్రసంగిస్తూ….ప్రభుత్వం అన్ని దశలలో తప్పులు చేస్తూ వచ్చిందన్నారు కోర్టులను, చట్ట సభలను, బీసీలకు మోసం చేసిందని విమర్శించారు. సినిమా దర్శకుడు ఈ ఎన్ శంకర్ ప్రసంగిస్తూ…42% రిజర్వేషన్లను వారే ప్రకటించారు. అమలుకు కట్టుబడి ఉన్నాం ఇప్పుడేమో ఇవ్వలేం అంటున్నారు. ఈ వైఖరి బీసీలను నట్టేట ముంచడమే అన్నారు. దీని మూకుమ్మడిగా ఐక్యమై సాధించాలన్నారు. ఈ సమావేశంలో 100 బీసీ కుల సంఘాల నేతలు, 30 30 బీసీ సంఘాలు, మహిళ, విద్యార్థి, నిరుద్యోగ, యువజన న్యాయవాదులు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ప్రముఖులలో రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ,జాతీయ బీసీ సంక్షేమ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జసత్యం ,జాతీయ యాదవ హక్కుల సంఘం రాములు యాదవ్ ,డాక్టర్ శంకర్ ముదిరాజ్ సంఘం కొండ దేవయ్య మున్నూరు కాపు సంఘం ,జయంత్ రావు కుమ్మరి సంఘం ,కోల శ్రీనివాస్ పూసల సంఘం , బోయ సంఘాల జాతీయ నేత బోయ గోపి,రాజ్ కుమార్ పద్మశాలి సంఘం, వీరేందర్ గౌడ సంఘం కే శ్రీనివాస్ కురుమ సంఘం , గొరిగ మల్లేష్ యాదవ్  తెలంగాణ ఓబీసీ ఫ్రంట్ చైర్మన్ , సిహెచ్ మల్లేష్ వంశరాజ్ సంఘం ,అశోక్ ఆరెకటిక సంఘం గాధ సమ్మయ్య రాజన్నల సంఘం వి.వెంకటేశ్వర్లు బుక్కయ్య వార్ల సంఘం టి . లక్ష్మణ్ మూర్తి దాసరి సంఘం వివిధ జాతీయ బీసీ సంఘాల నాయకులు అంజి, రాజేందర్, నీలం వెంకటేష్ , గొరిగే మల్లేష్ యాదవ్, వంశీకృష్ణ, అనంతయ్య , బరక కృష్ణ, నరేందర్ నేత , రఘు పెరిక,మహిళా నేతలు అన్నపూర్ణ గౌడ్, పద్మ, అంజలి యాదవ్, దివ్య గౌడ్, మున్నగు వారు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించారు. ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాల్గొంటామని హామీ ఇచ్చారు.

తీర్మానాలు

#రేపటి క్యాబినెట్ మీటింగులో  , జీవో నెంబర్ 46ను బెషరత్తుగా ఉపసంహరించుకోవాలి.#ఈనెల 26 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి #ఈనెల 29 నుండి రహదారుల దిగ్బంధనం #డెడికేటెడ్ కమిషన్ నివేదికలను వెంటనే బహిర్గతం చేయాలి.#జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికను బయట పెట్టాలి. #ఎక్కడికక్కడ వెంటనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఇళ్లను శాంతియుతంగా ముట్టడి చేయాలి. మౌన దీక్షలు గా పాటించాలి. #జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇచ్చి గెలిపించాలని తీర్మానించారు