జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలి : టీ డబ్ల్యూ జె ఎఫ్

Facebook
X
LinkedIn

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ని కోరిన టిడబ్ల్యూజేఎఫ్ నేతలు

మేడ్చల్ జిల్లా :

టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో టిడబ్ల్యూజేఎఫ్ ఆడహాక్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ద్వారా కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సలీమా మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. జర్నలిస్టులకు మెడికల్ హెల్త్ కార్డులు అందించాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

మేడ్చల్ జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ జి హరిప్రసాద్ మాట్లాడుతూ సుధీర్గ కాలంగా ఉన్నటువంటి జర్నలిస్టు ఇంటి స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్రిడేషన్ కార్డులు ఇప్పించాలన్నారు. జర్నలిస్టులకు ఇచ్చే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రి లలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కో కన్వీనర్ పి మల్లేష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని , జర్నలిస్టులకు భద్రత కల్పించాలని దానికై పోలీస్ అధికారులతో, రెవెన్యూ, సమాచార అధికారులతో జర్నలిస్టుల సంఘాలతో కమిటీలు ఏర్పాటు చేసి జర్నలిస్టులపై దాడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దేనికై ప్రత్యేక చట్టాలను తేవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడహాక్ కమిటీ సభ్యులు సింగం రాజు, పాండు, రవి, నరేందర్ జర్నలిస్టులు బాలు, మోహన్ రెడ్డి, జె సుధాకర్, హుస్సేన్, రోజా రాణి, సత్యనారాయణ, అరుణ్ కుమార్, దుర్గాప్రసాద్, సురేష్, రామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.