గ్రామ పంచాయతి ఎన్నికల రిజర్వేషన్లపై జివొ జారీ  

Facebook
X
LinkedIn

 హైదరాబాద్ :

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జివొను జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జివొలో పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. సర్చంచ్ పదవులకు రిజర్వేషన్లు ఆర్టివొలు ఖరాలు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపిడివొలు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.