నష్టపోయిన రైతులకు మీరు ప్రకటించిన 10 వేలు వెంటనే ఇవ్వాలి

Facebook
X
LinkedIn

ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్

జమ్మికుంట :

పంటలు చేతికి వచ్చాయి కానీ కాంటాలు లేవు, మిల్లుల్లో రోజుల తరబడి ధాన్యం దింపుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. క్విటాల్ కి 8 కేజీల తరుగు తీస్తున్నారు. ఆరుగాలం కష్టపడితే ఈ దోపిడీ ఎందీ అని రైతులు అడుగుతున్నారు. మీరు సన్న వడ్లకు ఐదువందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు.. ఇంకా అందరికీ అందలేదు ఈసారి అయినా ప్రతి రైతుకు అందించాలని కోరుతున్నాను. – రెండు లక్షల రుణమాఫీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. – వర్షాలు పడి వరి మునిగింది, తుఫాను మట్టి పాలు చేసింది.. – నష్టపోయిన రైతులకు మీరు ప్రకటించిన 10 వేలు వెంటనే ఇవ్వాలానీ డిమాండ్ చేసారు. – పత్తి విషయంలో కూడా నాన్చకుండా కొనుగోళ్లు చేయాలి. – 7 క్వింటాల్ నిబంధన లేకుండా కొనుగోళ్లు చేయాలని కోరుతున్నాం. సీసీఐ కూడా వర్షం వల్ల నష్టపోయి ఉన్నారు కాబట్టి నిబంధనలు సడలించాలి. – ఫసల్ భీమా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే రైతులకు ఇబ్బంది ఉండేది కాదన్నారు.
మెజారిటీ సీట్లు మావే :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వార్డు మెంబర్స్, సర్పంచులను, ఎంపీటీసీ,ఎంపీపీ, జీపీటీసీలను గెలిపించుకుంటాం. – వీరంతా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు. వారికి ఉన్నంత అవగాహన మాకు కూడా ఉండదు. – ఎమ్మెల్యేగా గెలవాలి అంటే వీరి పాత్ర కీలకం. – ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. – రెండు మున్సిపాలిటీలలో కూడా బూత్ పటిష్టం చేసుకొని గెలిపించుకుంటాం. – 107 గ్రామ పంచాయితీలలో మెజారిటీ గెలిచే సత్తా మాకే ఉంది. – ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలా కష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే కష్టపడి గెలిపించుకుంటాం. – త్వరలోనే నాయకులు కార్యకర్తలందరితో స్ట్రాటజీ మీటింగ్ పెట్టుకుంటాం. – సర్పంచ్ లను గెలిపించుకొనే భాద్యత నాది. నేను ఇక్కడికి వచ్చాక గత 20 ఏళ్లలో జెడ్పీటీసీ,ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఓడిపోయింది లేదు. 80 శాతం సర్పచులు మావే. ప్రతి ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించుకున్నామన్నారు.. హుజూరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి మా వాళ్ళని గెలిపించి ఇవ్వండి. పనులు చేయించే జిమ్మేదార్ నాది అని హామీ ఇస్తున్న.- నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సవత్సరం తరువాత ఏడాదిగా ఏం చేశారు అని ధర్నా చేశారు.. – మరి ఇప్పుడు గెలిచి రెండేళ్లు అవుతుంది ఏం చేశారు.. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అని అడుగుతున్న. – ప్రజలు చీకట్లో ఉండి పోయినం బిడ్డ అని ఏడుస్తున్నారు. అయిపోయింది ఏదో అయిపోయింది అప్పుడప్పుడు రా బిడ్డ అని అడుగుతున్నారు. నువ్వు రాకపోతే వెలుగు లేదని ప్రజలంటున్నారు. – నేను మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకున్న వాణ్ణి కాదు. – ప్రజలను, ధర్మాన్ని, పనిని నమ్ముకున్న వాణ్ణి. – 25 ఏళ్లు ఇలానే బ్రతికిన. ఉన్నదాన్నే చెప్పుకునే తెలివి లేని వాళ్ళం. నన్ను 25 ఏళ్లు గుండెల్లో పెట్టుకున్న గడ్డ హుజూరాబాద్.ఈ ప్రజలను ఎలా మర్చిపోతా.- తట్టెడు మట్టి తీయలేదు అన్నారు కదా.. మీరు వంద స్పీడ్ తిరుగుతున్న 4 లైన్ల రోడ్లు ఎవరు వేశారు? – కంటిరెప్పపాటు కరెంటు పోకుండా ఉండే సబ్ స్టేషన్లు ఎవరు కట్టించారు, – ఎప్పడు జలకళ ఉండేలా చెక్ డామ్ లు నిర్మించింది ఎవరు, – కమలాపూర్లో ఎడ్యుకేషన హబ్ తయారు చేసింది ఎవరు.. – ఇవన్నీ మా ప్రజలకు తెలుసు. – దొంగముఖాలకు అర్థం కావు.. అబద్ధాలు నమ్ముకొని బ్రతికే వారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు.