స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి రావాలి

Facebook
X
LinkedIn

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషీ

నల్లగొండ :

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఒక ముఖ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషీ ముఖ్య అతిథిగా హాజరై, రాబోయే ఎన్నికల సందర్భంలో పార్టీ సిద్ధత, బూత్ మేనేజ్‌మెంట్, ప్రజల అనుసంధానం వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.ఈసమావేశంలో జిల్లా ఎన్నికల ప్రభారి, మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొని, జిల్లా స్థాయి పార్టీ బలోపేతంపై, గ్రామం నుంచి బూత్ వరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై స్పష్టమైన దిశానిర్దేశం అందించారు.ఈ సమావేశానికి జిల్లా ప్రధాన నాయకులు, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా బలంగా పోటీ చేయడం ప్రతి బూత్‌లో ఓటర్లను చేరుకునే ప్రత్యేక కార్యక్రమాల అమలుప్రజా సమస్యలను గుర్తించి పార్టీ వేదికగా పరిష్కారం కోసం చురుకైన చర్యలు గ్రామం నుండి జిల్లా వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంవంటి అంశాలపై పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు అందించారు.పార్టీ శ్రేణులంతా ఏకమై, అంకితభావంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్‌లో బీజేపీ ముందంజలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నిష్పక్షపాతంగా, స్పష్టంగా వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తదేనని పేర్కొన్నారు.సమావేశం ముగింపులో మండల మరియు బూత్ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. వీరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.