42% రిజర్వేషన్ల అమలు ప్రభుత్వం బాధ్యత

Facebook
X
LinkedIn

పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే అంగీకరించేది లేదు
రాజ్యాంగ పరంగా 42% రిజర్వేషన్ల అమలు కాకపోతే రాష్ట్రము అగ్ని గుండమవుతుంది.
జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య


హైదరాబాద్ :

42% రిజర్వేషన్ల అమలు ప్రభుత్వం బాధ్యత” ప్ర్తభుత్వానిదేనని , పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే అంగీకరించే ప్రసక్తి లేదని,రాజ్యాంగ పరంగా 42% రిజర్వేషన్ల అమలు కాకపోతే రాష్ట్రము అగ్ని గుండమవుతుందని,జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఆదివారం జరిగిన “బిసి రిజర్వేషన్స్ న్యాయ సాధన దీక్ష”కు పెద్ద ఎత్తున బిసి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వం వహించారు. విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ, న్యాయవాదులతో సహా 60 కు పైగా బిసి కుల సంఘాలు పాల్గొన్నాయి.సభలో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య రాష్ట్రంలో బిసి కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం ఖచ్చితమైన జనాభా గణాంకాలు సమర్పిస్తే 42% రిజర్వేషన్ న్యాయపరంగా సాధ్యమవుతుందని తెలిపారు. కోర్టులు కూడా సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్ పెంపును పరిశీలిస్తాయని చెప్పారు.దీక్షకు అధ్యక్షత వహించిన మాజీ బిసి కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు—ప్రభుత్వం ప్రామాణిక పద్ధతులు పాటిస్తే 42% మాత్రమే కాదు, 52% రిజర్వేషన్లు కూడా అమలు చేయవచ్చని అన్నారు. “డేటా బలంగా ఉంటే చట్టపరమైన అవరోధాలు తగ్గుతాయి” అని వ్యాఖ్యానించారు.హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ పెంపు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం దే అని పేర్కొన్నారు. ఎల్. రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో కాంటేస్తేడ్ ఎంఎల్ఏ ఆరేపల్లి కుమార స్వామి,జాతీయ బీసీ విద్యార్థి కోఆర్డినేటర్ ఆర్. అరుణ్, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, ,జీలపల్లి అంజి, బిసి ఫ్రంట్ అధ్యక్షులు జి. మల్లేష్ యాదవ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిల సతీష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ రాందేవ్ మోడీ, బీసీ మహిళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణి అనురాధ గౌడ్, జాతీయ బీసీ మహిళ జాతీయ ప్రధాన కార్యదర్శి రమాదేవి జాతీయ బీసీ మహిళ రాష్ట్ర ప్రెసిడెంట్ గంగాపురం పద్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కటుకురి లక్ష్మి, శ్రావణి, లతాసింగ్ , శివ యాదవ్, నల్లగొండ ఖదీర్, రాజు నేత , వెంకటేష్, సిద్ధులు, సురేష్ రాజ్ కుమార్, రామ్ గోపాల్ యాదవ్ ,ప్రీతం, జంపాల రాజేష్, శామీర్ పేట్ కార్తీక్ పటేల్, అభిరామ్ గౌడ్ ,వివిధ జిల్లాలనుండి నేతలు పాల్గొన్నారు.