‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోస్ట్

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఫలితాల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోల్ అయ్యాయి. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చి.. డిపాజిట్ గల్లంతు అయింది.