నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న వినియోగదారుల సమాఖ్య

Facebook
X
LinkedIn

               సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి

హైదరాబాద్ :

వివిధ దశలలో వినియోగదారులలో చైతన్యం పెంచేందుకు భారత వినియోగదారుల సమాఖ్య (సిసిఐ) నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నదని, దీనిలో భాగంగా సిసిఐ జోనల్, జిల్లా స్థాయిల్లో విస్తరణ చేస్తున్నదని సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రెడ్ క్రాస్ భవన్ లో సీసీఐ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమ్ రెడ్డి అధ్యక్షతన   జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చక్రపాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వినియోగదారుల పక్షాన నిలబడి వారికి అండగా రూపొందించబడిన చట్టాలు బ్యూరోక్రాట్లు, వ్యాపార ఉత్పత్తిదారుల అజమాయిషితో నీరుగారిపోతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో వినియోగదారుల ఉద్యమ ప్రతినిధులకు నాయకత్వం వహిస్తున్న సిసిఐ చట్టాల రూపకల్పనలో కీలక భూమిక నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాజధాని వరకు వివిధ స్థాయిలో ఉన్న వినియోగదారుల సమస్యలను గుర్తించి వారి పక్షాన పోరాడుతున్న క్రమంలో వినియోగదారుల సమస్యల పరిష్కారానికి మరింత చేయూతనిచ్చేందుకు సీసీఐ  జోనల్ ఇన్చార్జిల నియామకం చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు జోన్లను ఏర్పాటు చేసి సీనియర్ వినియోగదారుల ఉద్యమ ప్రతినిధులను, సీసీఐకి రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో ఏర్పాటుచేసిన కమిటీలను సిసిఐ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమిరెడ్డి ప్రకటించారు. నెలాఖరుకల్లా జిల్లా స్థాయిలో సిసిఐ ప్రతినిధుల ఎంపిక పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో  సిసిసి సెక్రటరీ జనరల్ మొగిలిచర్ల సుదర్శన్, సీసీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ హరిప్రియ రెడ్డి, సీసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుప్రభ హత్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్, రావుల రంజిత్ కుమార్, సందు ప్రవీణ్, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి , ప్రవీణ, రంగన్న, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 సీసీఐ జోనల్ ఇన్చార్జులు వీరే…

ఆదిలాబాద్ జోనల్ ఇన్చార్జిగా మాజీద్, వరంగల్ జోనల్ ఇన్చార్జిగా బి శ్రవణ్ కుమార్, నల్గొండ జోనల్ ఇన్చార్జిగా ఎం .యశ్వంత్ కుమార్, హైదరాబాద్ జోనల్ ఇంచార్జ్ గా ఏవి రావు, మహబూబ్ నగర్ జోనల్ ఇన్చార్జిగా అనుదివ్య లను నియమించారు.