తమాషాలు చేస్తే.. తాట తీస్తా

Facebook
X
LinkedIn

కాలేజీలు బంద్‌ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతాము

ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం

ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

హైదరాబాద్ :

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బంద్‌ పాటిస్తున్న ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కాలేజీలు బంద్‌ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తా అని హెచ్చరించారు. ఏది పడితే అది చేస్తే చూస్తూ ఊరుకోవాలని అని మండిపడ్డారు.ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించమని అన్నారు. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్య అనేది సేవ అని.. దాన్ని వ్యాపారం చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకు తెలుసని అన్నారు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని తెలిపారు. అరోరా కాలేజీ రమేశ్‌కు ఎన్ని అనుమతులు ఇవ్వాలని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామని హెచ్చరించారు. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్‌ చేశారని అన్నారు. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అని నిలదీశారు. పాలమూరులో జయప్రకాశ్‌కు హైదరాబాద్‌లో క్యాంపస్‌ ఎందుకు అని నిలదీశారు.