6 లేన్లుగా హైదరాబాద్‌ – విజయవాడ హైవే.. భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్‌

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారి ఇప్పుడు ఆరు లేన్లుగా మారనుంది. ఈ మేరకు 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 269 కిలోమీటర్లు ఉన్న మొత్తం రహదారిలో 229 కి.మీ.ను నాలుగు వరసల నుంచి ఆరు లేన్లకు విస్తరించేందుకు భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.భూసేకరణకు సంబంధించి తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని 9 గ్రామాలు, నల్గొండ జిల్లా చిట్యాలలో 5, నార్కట్‌పల్లిలో 5, కట్టంగూర్‌లో 4, నకిరేకల్‌లో 2, కేతేపల్లిలో 4 గ్రామాలు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలంలో 4, చివ్వెంలలో 6, కోదాడ మండలంలో 4, మునగాల మండలంలోని 5 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను అక్కడి ఆర్డీవోలకు అప్పగించారు.ఇక ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ మండలంలో 4 గ్రామాలు, కంచికచర్లలో 4, జగ్గయ్యపేటలో 7, పెనుగంచిప్రోలులో 3, ఇబ్రహీంపట్నంలో 12, విజయవాడ రూరల్‌లో 1, విజయవాడ వెస్ట్‌లో 2, విజయవాడ నార్త్‌ లోని ఒక గ్రామంలో భూసేకరణ బాధ్యతలను అక్కడి జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు.