ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి ప్రోటీన్ అందించేవి చేపలు

Facebook
X
LinkedIn

       మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.

హైదరాబాద్ :

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి ప్రోటీన్ అందించేవి చేపలు అని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం శామీర్ పేట చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.- బెంగాల్లో చేపలను జలపుష్పాలు అంటూ వెజిటేరియన్లు కూడా తింటారు.- కోట్ల మంది దీనిమీద ఆధారపడి జీవిస్తున్నారు. – గతంలో చెరువుల మీద కాంట్రాక్టర్లు పెత్తనం ఉండేది. మత్స్యకారులకు చెరువుల మీద అధికారం లేకుండా చేశారు. మత్స్యకారులు కాంట్రాక్టర్ కి బ్రోకర్ కి చేపలు పట్టించే కూలీలుగా మాత్రమే పని చేసేవారు. – తెలంగాణ వచ్చిన తర్వాత వీటికి స్వస్తి పలికి సొంత సొసైటీ మెంబర్లు మాత్రమే చేపలు పట్టుకుని అమ్మాలి అని నిబంధన తీసుకొచ్చామన్నారు. – అనేక మీటింగులు పెట్టిన తర్వాత చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేశాము.- చేపపిల్లలు, ఫీడ్, మేనేజ్మెంట్, చేపలు పట్టడం, ఐస్ ఫ్యాక్టరీలు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందించడం ఇలా సమగ్ర ప్రణాళిక రూపొందించాము. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు.- నేను దీంట్లో రీసెర్చ్ స్కాలర్ ను.. అనేక  రాష్ట్రాలు తిరిగివచ్చాను.- ఆ స్టడీ ఫలితము కేజ్ కల్చర్, ఫిషరీస్ ఇండస్ట్రీస్, వాటర్ స్ప్రెడ్ ఏరియాల మీద అవుట్డేటెడ్ పద్ధతులు. – గొర్ల కాపర్లు, మత్స్యకారులుఇంకా గ్రామాలను పట్టుకుని ఉంటున్నారు ఊరు మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వలసలు లేకుండా ఉన్న ఊరు మీదనే ఆధారపడి బ్రతికేవారు కాబట్టి వీరికి వృత్తిపరంగా అన్ని రకాల మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. – శ్రీహరి  మత్స్యశాఖ మంత్రి అయ్యారు వీరికి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి. ఇది చిన్న శాఖ కాదు కోట్ల మంది దీనిమీద బ్రతుకుతున్నారు. పాలు పెరుగు చేపలు గుడ్లు ఇలా మనిషికి కావలసిన సగం అందించేది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. – హైదరాబాదులో చెరువులు మురికి కూపాలుగా తయారయ్యాయి రసాయన విషపూరిత జలాలు కలిసి చేపలన్ని చచ్చిపోతున్నాయని ఆవీదన వ్యక్తం చేసారు. – చర్లలోకి వచ్చే డ్రైనేజీని డైరెక్ట్ గా కాకుండా ప్యూరిఫై చేసి పంపించాలి లేదా డైవర్ట్ చేయాలని కోరాను దానికోసం నేను పూర్తిస్థాయిలో పనిచేస్తాను. – చెరువులు మనకు వరం లాంటివి.- నేను అనిమల్ హస్బెండరీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లో కూడా నెంబర్ను.- కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారాలు అందిస్తామన్నారు.- మత్స్యకారుల సంక్షేమం కోసం 25 ఏళ్లుగా పనిచేస్తున్న.. రాబోయే కాలంలో కూడా ఏ సమస్య ఉన్న అందుబాటులో ఉంటాను. – మూసి ప్రక్షాళన విషయంలో.. చెరువులు పొల్యూట్ కాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేద్దామన్నారు.- మత్స్య సహకార సంఘాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుందాం.- మత్స్యకారులకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ   గుజరాత్లో ఎవరు ప్రభుత్వంలో ఉండాలి అనేది మత్స్యకారులే నిర్ణయిస్తారు. 13 మంది దాకా ఎమ్మెల్యేలు ఉంటారు. – ప్రభుత్వ భూములు ఇవ్వండి మత్స్యకారుల సొసైటీలకు బిల్డింగ్ కట్టించే బాధ్యత నాది. – ప్రభుత్వం వేరు ప్రజలు వేరు కాదు.. ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అన్నారు.