భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Facebook
X
LinkedIn

వివాహేతర సంబంధమే కారణమా?
ఏన్కూరు మండలం కాలనీ నాచారం ఘటన

ఖమ్మం :

భార్య పరాయి వ్యక్తితో సహజీవనం చేస్తుందన్న ఆగ్రహంతో భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపిన ఘటన ఖమ్మం ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన తాటి రామారావు–గోవర్షిని దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల్‌ అలియాస్‌ ఆదమ్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్తకు అనుమానం. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఆమె భర్త, పిల్లలను వదిలి అఖిల్‌తో కలిసి వెళ్లిపోయింది.

కొద్ది రోజుల క్రితం పాల్వంచలో చదువుతున్న కూతురిని చూడడానికి వచ్చిన గోవర్షిని, రామారావు ఇంటికొచ్చింది. రామారావు తనతో ఉండమని చెప్పినా ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన రామారావు శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో భార్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో ఆమె తలపై నరికాడు. గోవర్షిని అక్కడికక్కడే మృతి చెందింది.

సూచన అందుకున్న ఏన్కూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే కారణమా లేక ఇతర కోణాలూ ఉన్నాయా అనేది విచారణలో బయటపడనుంది.