42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దే వద్దు చట్టపరంగా ఇవ్వాలి

Facebook
X
LinkedIn

ముఖ్యమంత్రికి పార్లమెంటు సభ్యులురాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య లేఖ.

హైదరాబాద్ :

రేపటి క్యాబినెట్ లో స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దే వద్దు చట్టపరంగా ఇవ్వాలని ముఖ్యమంత్రికి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య లేఖ రాసారు.రేపటి క్యాబినెట్ లో స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా వద్దే వద్దు. చట్టబద్ధంగా ఇవ్వాలని   ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. “మాకు బిక్షం వద్దు. చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసు బలంగా ఉంది. కేసు కోర్టులో ఉండగా తొందర దేనికి రెండు నెలలో తీర్పు రానుంది. రెండు నెలలు అగలేరన్నారు. మొన్నటి బంద్ చారిత్రాత్మకం. అన్ని పార్టీలు అన్ని వర్గాల మొత్తం మద్దతు ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇంత చారిత్రాత్మకంగా బంద్ జరగలేదు. బంద్ తీవ్రతను చూసి ప్రభుత్వం కళ్ళు తెరవాలని కృష్ణయ్య కోరాడు. ముఖ్యమంత్రికి లేఖ ద్వారా కోరారు.ఇప్పుడు స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధ, చట్టబద్ధత, న్యాయబద్ధత ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D-6 ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే అసెంబ్లీలో బీసీ బిల్లు చట్టం చేశారు. జనాభా లెక్కలు తీసి న్యాయ బద్దం చేశారు. గతంలో సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పులలో జనాభా లెక్కలు ఉంటే దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచవచ్చని తీర్పు చెప్పారు. అన్ని కోణాలలో పెంపుదలకు మద్దతు ఉంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చింది కావున అసెంబ్లీ చట్టం చేశారు జీవో తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే సుప్రీంకోర్టుకు ఏ కోర్టుకు ఎవరైనా వెళ్లిన బీసీల, కేసులు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి అసెంబ్లీ చట్టం చేశారు అలాగే సుప్రీంకోర్టు అగ్ర కులకు 10శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. పైగా ఇందిరా సహానీ కేసులో ఎంపరికల్ డాటా ఉంటే 50% సీలింగ్ ను అధిగమించవచ్చునని సుప్రీం కోర్టు అభిప్రాయం కూడా ఉన్నది. ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలిచే అవకాశం ఉంది. చట్ట ప్రకారము, న్యాయప్రకారము రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారు. చట్టపరమైనబలాల వారీగా రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు కేసు బలంగాయుందని పేర్కొన్నారు.