బిసి బంద్ నేపథ్యంలో దాడులకు పాల్పడ్డ ఎనిమిది మంది అరెస్టు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

బిసి బంద్ నేపథ్యంలో దాడులకు పాల్పడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిసి బంద్ సందర్భంగా బిసి జెఎసి నేతలు విద్యానగర్ నుండి బర్కత్‌పురా వరకు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళ్తున్న సమయంలో పలు షాపులు, షోరూంలు, పెట్రోల్ బంక్‌లు ఓపెన్ చేసి ఉండడంతో వాటిపై ఆందోళనకారులు దాడి చేశారు. 8 మంది బిసి జెఎసి ప్రతినిధులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో గుజ్జ కృష్ణ, రామకోటి, మోడీ రాందేవ్, సాయిబాబా,నిఖిల్  తోపాటు మరికొందరు ఉన్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్ కి వైద్య పరీక్షలు రీత్యా తరలించారు. అర్ధరాత్రి అరెస్టును బిసి సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపి ఆర్ కృష్ణయ్య ఖండించారు. షాపులపై బిసి సంఘం నాయకులు రాళ్లతో దాడి చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట పరిధిలో బిసి బంద్ నేపథ్యంలో బజాజ్ షో రూమ్, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పై తెరిచి ఉండడంతో వాటిపై రాళ్లు విసిరి బలవంతంగా బిసి నాయకులు మూయించిన విషయం తెలిసిందే.