తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్టులపై ఎసిబి దాడులు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్టులపై ఎసిబి దాడులు నిర్వహిస్త్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో ఆరు చెక్ పోస్టులపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా లోని క్రిష్ణా, సంగారెడ్డి జిల్లా లోని జహీరాబాద్, కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, మద్నూర్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా లోని ఆశ్వరావు పేట చెక్ పోస్ట్, కొమరంభీమ్ జిల్లా లోని వాంకిడి చెక్ పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్, రజినీ భాయి, తిరుపతి, కిరణ్ కుమార్, ఆఫ్రోజ్ లను అదుపులోకి తీసుకొని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏకకాలంలో ఎసిబి దాడులు నిర్వహించడం రెండో సారి కావడం గమనార్హం.