ఒఆర్ఎస్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు…

Facebook
X
LinkedIn

 వైద్యురాలి పోరాటానికి దిగొచ్చిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా  

హైదరాబాద్ :

ఒఆర్ఎస్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు… వైద్యురాలి పోరాటానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా దిగొచ్చినది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ నీళ్ల విరేచనాలు వస్తే ఒఆర్ఎస్ ద్రావకం వాడాలి అనేది గత 30 ఏళ్లుగా ప్రాచుర్యం పొందిన ఒక వైద్య ప్రక్రియ. ఒఆర్ఎస్ ద్రావణంలో కొంత ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఉంటుంది. దీని వలన ఎక్కువ వాటర్ అబ్జర్బ్ కావడం వలన డిహైడ్రేషన్ భారి నుంచి తప్పించుకోవడమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ రిప్లేస్మెంట్స్ జరుగుతుంది. ఒకవేళ ఒఆర్ఎస్ ద్రావణం అందుబాటులో లేకుంటే నీళ్లలోకి కొంచెం ఉప్పు సోడాపొడి, నిమ్మకాయ రసం పిండుకొని తాగిన కానీ సరిపోతుంది. దానిలోకి ఒక స్పూను చక్కెర వేసుకోవాలి. కానీ చక్కెర మోతాదు ఎక్కువ అయితే ఆ మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి డిహైడ్రేషన్ పెరిగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.సరిగ్గా ఇదే విషయాన్ని ఓ పిల్లల వైద్య నిపుణురాలు గుర్తించింది. ఏమిటి అంటే కొందరు పిల్లలు ఒఆర్ఎస్ ద్రావకం తాగినా కానీ చనిపోతున్నారు. ఏమిటా ఒఆర్ఎస్ ద్రావకము అని చూస్తే అది అన్ని మెడికల్ షాపుల్లో అమ్ముతున్న ఒక బ్రాండెడ్ ద్రావకం. టెట్రా ప్యాక్ లో దానిని అమ్ముతూ ఉన్నారు. ఈ బ్రాండెడ్ ద్రావకం కూడా ఒఆర్ఎస్ అనే పేరుతో అమ్ముతూ దానిలో ఒక చిన్న లెటర్స్ లో దీనిని నీళ్ల విరేచనాలు వస్తే వాడరాదు అని రాశారు.. ఇందులో గ్లూకోజ్ కంటెంట్ చానా రెట్లు ఎక్కువ ఉండడమే కారణం.సిఎం శివరంజని అనే హైదరాబాద్ కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ ఇది కనుక్కొని దానిని పేరు మార్చుకోండి ఒఆర్ఎస్ అనేది డబ్ల్యు హెచ్ఒ రూల్ ప్రకారం దానిని దేనికంటే దానికి బ్రాండెడ్ గా ఉపయోగించరాదు. అని చెబితే ఎవరూ వినలేదు, దానికోసం ఆమె కోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించింది.. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎనిమిదేళ్ల న్యాయపోరాటం తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసింది ఒఆర్ఎస్ అనేది ఎటువంటి రూపంలో కూడా పేరును దేనికి సాఫ్ట్ డ్రింక్స్ కు ఉపయోగించరాదు.అది ఒక మందు అది ఒక కూల్డ్రింక్ కాదు అని వివరించింది.