బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతల ఆదిపత్య పోరు

Facebook
X
LinkedIn

ఆర్.కృష్ణయ్య వర్గీయుల మద్య ఆదిపత్య పోరు ..

ఒకరిపై ఒకరుం చేయి చేసుకున్న వైనం..

హైదరాబాద్ :

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ  బీసీ సంక్షేమ సంఘం ఆర్.కృష్ణయ్య వర్గీయుల మద్య ఆదిపత్య పోరు బగ్గుమంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చినుకు చినుకు గాలివానై తారా స్తాయికి చేరుకుని ఒకరిపై ఒకరుం చేయి చేసుకున్నారు.ఆర్.కృష్ణయ్య వర్గీయులయిన బీసీ సంఘము నేతలు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ బిజెపి రాష్ట్ర అద్యక్షులు ఎన్.రామచంద్ర రావు తో ఫోటోలు దిగే సమయం లో ఆదిపత్య పోరు కొట్టొచ్చినట్లు కనబడింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ  కృష్ణ  ను సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అనుచరుడు ఫోటోలు దిగే సమయం లో గుజ్జ కృష్ణ ను హోదాను మరిచి  పక్కకు తోసాడు.జూనియర్ అయ్యి ఉండి ఫోటోలకు ఎలా ముందుకి వెళ్తావు అంటూ ఒక్కరిపై ఒక్కరు అరుస్తూ పక్కకు తోయగా,వెంటనే స్పందించిన గుజ్జ కృష్ణ అనుచరుడు తోసిన వ్యక్తి పై దాడికి పాల్పడం తో పరిస్థితి ఉదృతంగా మారి ఒకరిపై ఒప్కరు చేయి చేసుని నానా భీబస్తం సృష్టించారు. వెంటనే స్పందదించిన బిజెపి రాష్ట్ర అద్యక్షుడు రామచంద్రా రావు జోక్యం తో గొడవ సద్దుమణిగింది. ఈ నెల 18 న బంద్ కు మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య తో కలిసి బీసీ సంక్షేమ సంఘం నేతలు  బిజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.రామచంద్ర రావు, ఆర్ కృష్ణయ్య ముందే గొడవ అవ్వడం గమనార్హం