సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందాలి

Facebook
X
LinkedIn

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా :
సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని చట్టం ద్వారా ప్రయోజనం పొందాలన్నదే సమాచార హక్కు చట్టంయొక్క ముఖ్య ఉద్దేశమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు.
సమాచార హక్కు చట్టం -2005 వారోత్సవాలలో భాగంగా బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం -2005 పై అవగాహాన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, రాధికగుప్తా లతో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం -2005 ఏర్పడి 20 సంవత్సరాలు అవుతున్నదని, ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ప్రజలలో అవగహాన కల్పిచేందుకు కమీషన్ అవగహాన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలోఈ అవగాహాన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయాలలోఈ అవగహాన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచార హక్కు చట్టం గురించి తెలియజేయడమే కాకుండా, ఈ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, చట్టం వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రజలలో పూర్తిఅవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కార్యాలయంలో ఎపిఐఓ, పిఐఓ, అప్పీలేట్ అథారిటిగా నియమిస్తూ,ఆర్టిఐ దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేందుకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టంలో తిరస్కరణలకు కూడా కారణాలు తెలిపే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ఎపిఐఓ, పిఐఓ దరఖాస్తుదారునితో సానుకూల దృక్పధంతో వ్యవహారించాలని అవసరమైన మేరకు మార్గనిర్దేశం అందించి సానుకూలంగా స్పందిస్తూ సహాకరించాలన్నారు. ప్రతి డిపార్ట్ మెంట్ చేసే పనులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అందుకు క్రీయాశీలమైన సమాచారం ఇవ్వాలన్నారు. ఈ చట్టం అమలు ద్వారా అవినీతి తగ్గుతుందన్నారు.
అనంతరం జిల్లా కోఆపరేటివ్ అధికారి వెంకట్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమాచార హక్కు చట్టం -2005 పై ఎపిఐఓ, పిఐఓలకు అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమంలో చట్టం పై ప్రజల సందేహాలను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి నివృత్తి చేసారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ,ఎఓరామ్మెహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎపిఐఓ, పిఐఓ, తదితరులు పాల్గొన్నారు.