హైదరాబాద్ :
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా “సేవా పక్వాడా” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈసందర్బంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సమాజానికి సేవలందించిన విశిష్ట వ్యక్తులు, పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం జరిగింది. వారు సాధించిన విజయాలు, అందించిన సేవలను గౌరవిస్తూ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాన్ని పొందించారు.డాక్టర్లు, క్రీడాకారులు, వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులను సత్కరించి, తద్వారా రాబోయే తరాలకు ప్రేరణ దించడమే ఉద్దేశ్యం.ప్రధానంగా యువతలో స్ఫూర్తి నింపడం, నశా ముక్త్ భారత్ (డ్రగ్స్ ఫ్రీ నేషన్) గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్లాలి.విద్యార్థులు, యువత క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్రగ్స్ నుంచి విముక్తి పొందేలా స్ఫూర్తినింపాలి.ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, యువత నుంచి మంచి స్పందన వచ్చింది.