నవంబర్‌ 11 వ తేదీన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక

Facebook
X
LinkedIn

ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌

హైదరాబాద్ :

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బిహార్‌ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 11 వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.తాజా షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 14వ తేదీన కౌంటింగ్‌ చేసి, ఫలితాలు విడుదల చేస్తారు.