ఈ సి నగర్ లో ఘనంగా మహాత్మ గాంధీ ఎల్.బి.శాస్త్రి జయంతి ఉత్సవాలు 

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ లో మహాత్మగాందీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్లో ఈసీ నగర్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహుదూర్ శాస్త్రి పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా ఈసీ నగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ సత్యం అహింస లతోనే స్వాతంత్ర పోరాటం నిర్వహించి మన దేశానికి స్వాతంత్ర సంపాదించారని తెలిపారు .

 హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి జగ్గరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పంచశీల సూత్రములు పాటించడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈరోజే మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా నిర్వహించుకుంటున్నామన్నారు. సొంత హోమ్ లేని హోమ్ మినిస్టర్ గా పనిచేసిన నేత ఎల్ బి శాస్త్రి ఆని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో ఈసీ నగర్ బిల్డింగ్ సొసైటీ డైరెక్టర్ భిక్షపతి, సీనియర్ సిటిజెన్ కార్యదర్శి సత్తిరెడ్డి, వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు సి హెచ్ వర ప్రసాద్, కార్యదర్శి మల్లేష్, కోశాధికారి బాల్ రెడ్డి, హరి ప్రసాదు, కాలనీ వాసులు సత్యనారాయణ రెడ్డి, గోవర్దన్, బాల్ రెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొని గాంధీ విగ్రహానికి ఎల్.వి శాస్త్ర చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.