మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా జింఖానా మైదానంలో వాసవి క్లబ్స్ లక్ష బెలూన్ల ప్రదర్శన

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకట స్వామి అన్నారు.సికింద్రాబాద్ జింఖానా మైదానంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో “సే నో టు డ్రగ్స్” పేరుతో నిర్వహించిన లక్ష బెలూన్ల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ వినూత్న ఆలోచన సమాజానికి అవగాహన కలిగించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అభినందించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ –అక్టోబర్ 1న వాసవి క్లబ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని, డ్రగ్స్ అనే సామాజిక వ్యాధికి వ్యతిరేకంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.మత్తుమందుల వినియోగం తెలంగాణలో ఆందోళనకర స్థాయిలో ఉందని, రాష్ట్రంలో సుమారు 64 వేల మంది ఇంజెక్షన్ రూపంలో హానికర మత్తుమందులను వాడుతున్నారని, అలాగే 15 లక్షల మంది గంజాయి వంటి పదార్థాలకు బానిసలయ్యారని నివేదికలు చెబుతున్నాయని వివరించారు.ప్రజల్లో విస్తృతమైన అవగాహన కోసం లక్ష బెలూన్ల ప్రదర్శన నిర్వహించామని తెలిపారు.