హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు ఘన స్వాగతం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం తెలిపింది.ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ క్రీడాశాఖ తరఫున తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి , ఎండి సోనీ బాలాదేవి తిలక్ వర్మను సత్కరించారు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి, తెలంగాణకే కాకుండా దేశానికి కీర్తి తెచ్చిన తిలక్ వర్మను శివసేనారెడ్డి అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించిన తిలక్ వర్మ ప్రదర్శన యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారని శివసేనారెడ్డి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ, పోలీస్ శాఖ, ప్రోటోకాల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.