కరూర్‌ సభ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం పార్టీ పరిహారం

Facebook
X
LinkedIn

         మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు.. క్షతగాత్రులకు రూ.2 లక్షలు

చెన్నై :

తమిళనాడు రాష్ట్రం కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం పార్టీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని టివికె వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. బాధితులకు అండగా ఉంటామన్న టివికె అధినేత విజయ్‌ హామీ ఇచ్చారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదికను హోంశాఖ కోరింది. సిఎం స్టాలిన్, గవర్నర్‌కి అమిత్ షా ఫోన్ చేసి ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై చిరంజీవి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. శనివారం తమిళనాడు రాష్ట్రం కరూర్‌లో నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో గాయపడిన విషయం విధితమే. ఈ ఘటనపై విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.