ఎల్లలు దాటిన బతుకమ్మ పండుగ…సామాజికవేత్త రవీందర్ ముదిరాజ్.

Facebook
X
LinkedIn

తెలంగాణ మహిళలకు అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ సంప్రదాయం రాష్ట్రంలోనే కాకుండా ఎల్లలు దాటడం ఎంతో గర్వంగా ఉందని పర్యావరణ పరిరక్షకుడు, సామాజికవేత్త రవీందర్ ముదిరాజ్ అన్నారు. అమెరికాలో ని ఆర్కన్ స్టేట్ లిటిల్ రాక్ లో యుడే స్థానిక తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బతకమ్మ కార్యక్రమంలో రవీందర్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆటపాట చూస్తుంటే సొంత ఊరిలోనే ఉన్నట్టు అనిపించిందన్నారు. మహిళలు సంప్రదాయా దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, భక్తిశ్రద్ధలతో ఆడుతుంటే తెలంగాణ పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఉందన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత అక్కడీ వారికి తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం సపంతి భోజనాలు చేసి సందడి చేశారు.