నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా 130వ జయంతి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో 28 9 2025 ఉదయం కమలానగర్ ఆఫీస్ హాల్లో ప్రముఖ కవి నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ జరిగింది. సంస్మరణ సభకు స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.

సామాజిక ఉద్యమ నేత జయరాజు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎం భాస్కర్ రావు మాట్లాడుతూ గుర్రం జాషువా జీవిత విశేషాలను వివరించారు. జయరాజు మాట్లాడుతూ గుర్రం జాషువా అంటరానితనాన్ని ఎదుర్కొని కుల వివక్ష విష కాలనాగు పడగ కింద నలిగినప్పటికీ గట్టిగా ఎదుర్కొని నిలబడ్డారని చెప్పారు. గుర్రం జాషువా నాకు ప్రధానంగా ఇద్దరు గురువులని చెప్పారని అన్నారు. ఆకలి జీవితాన్ని చూపించిందని కుల వివక్ష ఎదిరించే తత్వాన్ని బోధించిందని చెప్పారు. గుర్రం జాషువా తన రచనలు కుల వివక్షను, ప్రజల ఐక్యతను పోరాట రూపాలను ప్రధాన భూమికగా పెట్టుకొని రచనలు చేశారని చెప్పారు. ముఖ్యంగా గబ్బిలం కవిత రూపం శివునికి మొరపెట్టుకునే తత్వాన్ని అద్భుతంగా చెప్పారని అన్నారు. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును అందజేసిందని చెప్పారు. గుర్రం జాషువాకు నిజమైన నివాళి అంటే ప్రజలందరూ కుల వివక్షను లేకుండా సమానంగా జీవించే సమాజం కొరకు పోరాడటమే అని అన్నారు. శివ నారాయణ మాట్లాడుతూ గుర్రం జాషువా గొప్ప రచనలు చేశారని వారు అందించిన పద్యాలను రాగయుక్తంగా పాడి సభను ఆనందింపజేశారు. కృష్ణమాచార్యులు మాట్లాడుతూ 100 సంవత్సరాలకు ముందు కుల వివక్ష కలిగి దానిపై పోరాడిన చరిత్ర గుర్రం జాషువాదని నేడు నేటికీ కుల వివక్ష వివిధ రూపాల్లో కొనసాగుతుందని దానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. గోవిందరావు మాట్లాడుతూ అందరూ ఛీ కొట్టిన చోటనే శభాష్ అనిపించుకుని గండే పెండేరం తొడిగించుకున్నారని చెప్పారు.

మల్లేశం , కోమటి రవి , ధరణి పత్రికా ఎడిటర్ రోజా రాణి, గుమ్మడి హరిప్రసాద్, గద్దల నరసింహారావు మాట్లాడారు. కవి దిగ్గజాలు విశ్వనాధ సత్యనారాయణ , గుర్రం జాషువా సూటి పోటి మాటలు సైతం చమత్కారూపంగా ఎలా మాట్లాడుకునేవారు చెప్పి సభను ఆనందంపజేశారు. అనంతరం సభ్యులందరూ జాషువా చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి, ప్రభాకర్, హెచ్.వి స్వామి, శ్రీనివాసరావు, గద్దల నరసింహారావు, గోపి, కృష్ణమాచార్యులు, రోజా రాణి, భాస్కర్ రావు, గోవిందరావు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.