ఎటిసి (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) సెంటర్ల అవకాశాన్ని విద్యార్థులు సద్వనియోగం చేసుకోవాలి

Facebook
X
LinkedIn

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా :
ఎటిసి (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) సెంటర్ల ద్వారా మీలోని నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని బయటికి తీసి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఐటిఐ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు.
శనివారం శామీర్ పేట్ మండలంలో ఐటిఐ కాలేజీలో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ఎటిసి సెంటర్ ను ప్రారభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీలోని నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని బయటికి తీసేందుకు ఐటిఐ లను పునరుద్దరించి నిరుద్యోగయువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఎటిసి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మారుతున్న టెక్నాలజీకనుగుణంగా మీరు ఆలోచించి ఆవిష్కరణలను రూపొందించాలని అన్నారు. మీరు నేర్చుకునే అంశం గురించి తప్పకుండా మీ తోటి వారితో చర్చించాలని తద్వారా అంశం పై పూర్తి అవగాహాన కలుగుతుందన్నారు. మీలోని భయాన్ని విడిచి నలుగురిలో మాట్లాడేలా మిమ్మల్నిమీరు తీర్చి దిద్దుకోవలన్నారు. అందువల్ల భవిష్యత్తులో ధైర్యంగా ఇంటర్వ్యూలలో సమాధానం ఇవ్వగలుగుతారని విద్యార్థులకు హితబోధ చేసారు. చాలా వరకు విద్యార్థులకు ఇంటర్వ్యూలలో థియరీ నాలెడ్జ్ ఉంటుంది కాని ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం ద్వారా ఉద్యోగాలు రావడం లేదని, ఈ సమస్యనధిగమించేందుకే ప్రభుత్వం ఎటిసి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి మీరు థియరీ తోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలన్నారు. ఎన్ని విషయాలు తెలిసి ఉన్నప్పటికి వాటి గురించి బయటకి చెప్పగలిగినప్పుడే గుర్తింపు వస్తుందని అన్నారు. మీలోని సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోని ఏదో ఉద్యోగం కోసం కాకుండా పదిమందికి ఉపాధి కల్పించే విధంగా పేద్దగా ఆలోచించాలని విద్యార్థులకు తెలిపారు. మీరు చదివే అంశాల గురించి ఎక్కువగా విశ్లేషణ చేస్తుంటే మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయని వాటిలో ముఖ్యమైన అంశాల గురించి చర్చించాలని సూచించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి కలెక్టర్ ఎటిసి సెంటర్లోని మిషనరీలకు పూజ చేసారు. అనంతరం కలెక్టర్ ఎటిసి సెంటర్లోని గదులను కలియ తిరిగి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాధిక, ఐటిఐ కాలేజీ ప్రిన్సిపల్ లలిత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.