బాంచన్ నీ కాళ్ళు మోక్కుతా అన్న ప్రజలతో బందూక్ పట్టించిన చాకలి ఐలమ్మ

Facebook
X
LinkedIn

  పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కు మంత్రి వాకిటి శ్రీహరి ఘన నివాళి  

హైదరాబాద్ :

బాంచన్ నీ కాళ్ళు మోక్కుతా  అన్న ప్రజలతో బందూక్ పట్టించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి వాకిటి శ్రీహరి  అన్నారు.గాంధీ భవన్లో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పులా మలవేసి నివాళులు అర్పించారు.చాకలి ఐలమ్మ వారసులతో కలిసి కేక్ కట్ చేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్,మెట్టు సాయి కుమార్, ఐలమ్మ వారసురాలు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ 130 జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులం మేము అని గర్వంగా చెప్తానుబాంచన్ నీ కాళ్ళు మోక్కుతా  అన్న ప్రజలతో బందూక్ పట్టించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఇంత టెక్నాలజీ ఉన్న ధైర్యం చేయలేని పరిస్థితులు మనవి….అప్పట్లో ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంఅన్ని వర్గాల ప్రజలు ఆమె బాటలో నడవాలి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందన్నారు. రాష్ట్రం ఈరోజు ఇలా ఉందంటే అది ఐలమ్మ స్ఫూర్తి ఐలమ్మ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాదు అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు…ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో మంత్రిగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తా మన్నారు.