కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఘనంగాబ తుకమ్మ వేడుకలు

Facebook
X
LinkedIn

  ముఖ్య అతిధిగా పాల్గొన్న రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి

హైదరాబాద్(సిద్ధిపేట) :

సిద్ధిపేట జిల్లా ములుగులో ఉన్న  కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకల్లో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యూనివర్సిటీ లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తో కలిసి బతుకమ్మ పాటలు పాడారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు బతుకమ్మ అద్దం పడ్తుందన్నారు భవానీ రెడ్డి. బతుకమ్మ అంటేనే ప్రకృతితో ముడిపడ్డ పండుగని, పువ్వులనే పూజించే ఫెస్టివల్ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో రెండు కేటగిరిలలో గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పది వేల మందితో 63 ఫీట్ల బతుకమ్మ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా టూరిజాన్ని కల్చర్ను ప్రమోట్ చేసుకుందామని పిలుపునిచ్చారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి పల్లెలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగేలా చూస్తుందని తెలిపారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేండ్లు ఒకే కుటుంబం ఏలిందని, బతుకమ్మ వేడుకలో సైతం ఆ కుటుంబమే కనిపించేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో బతుకమ్మ పండుకలో ప్రతి ఆడబిడ్డా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ రాజీ రెడ్డి తోపాటు అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.