బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా రవి నాయక్ బాద్యతలు స్వీకరణ

Facebook
X
LinkedIn

హైదరాబాద్  :

బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా రవి నాయక్ మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు గిరిజన సంప్రదాయ పద్ధతిలో నృత్యాలతో ఆయన పెద్ద ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల  బాలరాజ్ తో పాటు పలువురు గిరిజన నాయకులు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరైనారు