మరింత ఉదృతంగా ఆర్యవైశ్య కార్పోరేషన్ సేవలు

Facebook
X
LinkedIn

జిల్లాలవారీ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం

* ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత

హైదరాబాద్ :

కార్పొరేషన్ ద్వారా మరింత ఉధృతంగా జిల్లాలలోని నిరుపేద ఆర్యవైశ్యులకు సేవలు అందించాలని ఉద్దేశంతో… రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత తెలిపారు. కార్పొరేషన్ కు అందుబాటుతో పాటు, కాంగ్రెస్ కు విధేయులుగా ఉండి, ప్రభుత్వపరంగా ఆర్యవైశ్యులకు సేవలు అందించే అంకిత భావం గల వారి నుంచి నియామకాల కోసం హైదరాబాదులోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు   ఈ మేరకు ఆమె వీడియో క్లిప్ ఒకటి ఆర్యవైశ్య సంఘం యాదగిరిగుట్ట వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కార్పొరేషన్ డైరెక్టర్లుగా భావించుకోరాదని… కేవలం నిరుపేద ఆర్యవైశ్యులకు అంకితభావంతో సేవ చేసే వారిగా మాత్రమే (  ఇన్చార్జీలుగా ) భావించాలని ఆమె కోరారు. ప్రతి జిల్లాలో నేరుగా తాను ఆర్యవైశ్యుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం సాధ్యపడదని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కల్వ సు జాత వివరించారు. కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత ఆమె తొలి చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ప్రభుత్వం తొలి బడ్జెట్లో కార్పొరేషన్ కు 25 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం విదితమే.  నేరుగా బడ్జెట్ నిధులతో పాటు …కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ పథకాల కార్యక్రమాలు కూడా అమలు జేయాల్సి ఉంటుంది. ఆర్యవైశ్యులు  అగ్రవర్ణ జాబితాలో ఉన్నారు. పేరుకే అగ్రవర్ణం. దాదాపు 90 శాతం మంది ఆర్యవైశ్యులు పేద, మధ్యతరగతి కి చెందినవారు మాత్రమే ఉన్నారు.  ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్యవైశ్యులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆనాడు భావించారు. తమకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఉండాలని ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాల నుండి  విజ్ఞప్తులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేకంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 34 కార్పొరేషన్ల  చైర్పర్సన్ లను నియమించిన సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తొలి చైర్పర్సన్ గా కాల్వ సుజాత నియమితులైన విషయం తెలిసిందే .