
తప్పిపోయిన బాలిక.. హైదరాబాద్‌లో ప్రత్యక్షం
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్‌కు బాలిక స్వాతి కనిపించకుండా పోయిన విషయం విదితమే. అమ్మమ్మ లాలమ్మ సరంక్షణలో ఉన్న బాలిక నవంబర్ 22న అదృశ్యమవడం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 18 రోజుల తర్వాత బాలిక ఆచూకీ కనిపెట్టారు. హైదరాబాద్‌లోని సూరారం పోలీసులు గుర్తించి కరన్‌కోట్ పోలీసులకుసమాచారం ఇచ్చారు. కరన్‌కోట్ ఠాణా సిబ్బంది నగరానికి వెళ్లి బాలికను వికారాబాద్ సఖి సెంటర్‌కు తరలించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశ్వర్లు స్వాతితో మాట్లాడారు. బుధవారం బాలిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులతో మాట్లాడుతామన్నారు. బాలికను లాలమ్మ పోషించే స్థితిలో ఉందాలేదా క్షేత్రస్థాయిలో తమ సిబ్బంది పరిశీలిస్తారని.. లేదంటే సీడబ్ల్యూసీ ఆధీనంలో ఉన్న పరిగి బాల సదనం వసతి గృహంలో ఆశ్రయమిచ్చి చదివిస్తామన్నారు. కాగా బాలిక హైదరాబాద్‌కు ఎలా వెళ్లింది..? ఇన్ని రోజులు ఎక్కడ ఉంది? స్వాతితో మాట్లాడిన తర్వాత వెల్లడిస్తామన్నారు.
18 రోజుల తర్వాత స్వాతి ఆచూకీ లభ్యం
సఖి సెంటర్‌కు తరలించిన కరన్‌కోట్ పోలీసులు